calender_icon.png 28 August, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతులకు తప్పని ఇక్కట్లు

28-08-2025 02:54:58 PM

ఉప్పరిగూడ సహకార సంఘం వద్ద రైతుల తోపులాట  

సరిపడా యూరియా లేకపోవడంతో లబోదిబోమంటున్నా రైతులు

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ వ్యవసాయ సహకార సంఘం(Agricultural Cooperative Society) ఆధ్వర్యంలో నడుస్తున్న ఎరువుల గోదాంను రీజనల్ విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఈ రోజు ఉదయం సొసైటీ వద్దకు యూరియా లోడ్ రావడంతో  రైతులు గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ పనులు ముమ్మరమైన నేపధ్యంలో రైతులు సొసైటీ వద్దకు వచ్చారు. ముందుగా ఒక ఆధార్ కార్డుపై రైతులకు 3 బస్తాల యూరియా ఇవ్వగా, ఆ తర్వాత స్టాక్ తక్కువగా ఉండడంతో మిగతా రైతులకు 2 బస్తాలు, ఆ తర్వాత మిగిలిన రైతులకు స్టాక్ అయిపోయిందని చెప్పడంతో చేసేదేమీ లేక రైతులు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. 

ఆధార్ కార్డ్ తెచ్చిన వారిలో ఎవరికి పడితేవారికి ఇవ్వడం వల్ల దళారులు సైతం తీసుకెళ్లి బయట 300 నుండి 400 వరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావున ఆధార్ కార్డుతో పాటు భూమి పాస్ బుక్ తప్పనిసరి చేయాలని, లేదంటే అసలైన రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులకు సరిపడే యూరియాను అందుబాటులో ఉంచి, రైతులకు అందజేయాలని కోరారు. ఈ తనిఖీల్లో ఏడీ సుజాత, మండల వ్యవసాయ అధికారి విద్యాధరి, రైతులు పాల్గొన్నారు.