27 April, 2026 | 1:47 AM

అధికారంలో ఉన్నా.. అసంతృప్తి

27-04-2026 12:00 AM
  1. పార్టీ తీరుపై సీనియర్ కాంగ్రెస్ నేతల గుర్రు 
  2. స్థానిక సంస్థల్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం 
  3. దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టని అధిష్టానం 
  4. కష్టాల కడలిలో కార్యకర్తలు 

నిర్మల్ ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అధికారులు ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం. ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండున్నర ఏళ్ళు గడిచిన నిర్మల్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ లో వర్గ విభేదాలు ఆ పార్టీకి లాభం కంటే నష్టమే చేస్తున్నాయన విమర్శలు వినవస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకో టగా ఉన్న నిర్మల్ జిల్లా ఇప్పుడు బిజెపి వైపు మొగ్గు చూపడానికి కాంగ్రెస్లో వర్గ విభేదాలు, న్యాయకత్వ పోరు, పార్టీ అనుసరి స్తున్న విధానం, సీనియర్ జూనియర్ నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఆ పార్టీకి మరింత రాష్ట్రాన్ని తెచ్చిపెడుతుంది.

నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఒకవైపు పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలని జిల్లా కేడర్ను శాసించిన పార్టీలో మాత్రం వర్గ విభేదాలు గత ఆరు నెలల నుంచి ముదురుతూ నువ్వెంత అంటే నేనెంత అని స్థాయికి చేరుకోవడంతో పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్త లకు మింగుడు పడడం లేదు.

నిర్మల్ జిల్లా లో నిర్మల్ ముధోల్ ఖానాపూర్ అసెంబ్లీ స్థా నాలు ఉండగా ఖానాపూర్ నుండి సెట్టింగ్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్, ప్రాతినిథ్యం వహిస్తుండగా నిర్మల్ ముధోల్ నుండి బిజెపి ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్చార్యులుగా నారాయణరావు పటేల్, శ్రీ హరి రావు వివరిస్తుండగా మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి మాజీమంత్రి వేణుగోపాల చారి ఇంద్రకరణ్ రెడ్డి రేఖా శ్యాం నాయక్ మాజీ ఎమ్మెల్యే వంటి నేతలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో సయోధ్య కుదరవక పార్టీ పదవుల్లో తమ వర్గాలకు అన్యాయం జరిగిందని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు 

సీనియర్ నేతల అసంతృప్తి..

నిర్మల్ జిల్లాలో గత ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పటికీ నిర్మల్ జిల్లాకు ఏకైక ఎమ్మెల్యే ప్రాథమిత్యం ఉన్న ఇక్కడ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలకు నామినేట్ పదవులు ఇవ్వడం లేదు. అయితే పార్టీలో కష్టకాలం లో పనిచేసి వారికి జిల్లా కమిటీలు కొందరికి స్థానం దక్కలేదు. నిర్మల్ జిల్లాలో డిసిసి అధ్యక్షులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమా బుజ్జి పటేల్ కొన సాగుతుండగా 66 మందితో జంబో జిల్లా కమిటీని ప్రకటించారు.

ఇందులో జిల్లా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శు లు కోశాధికారి సలహా సభ్యులు ఇలా వివిధ సామాజిక వర్గాల వారీగా పదవులు ఇచ్చినప్పటికీ కొన్ని నియోజకవర్గంలో ఒక వర్గానికి మాత్ర మే పదవులు దక్కడంతో తమ వర్గీలకు అన్యాయం చేశారని నేతలు పార్టీ అధిష్టానం ముందే అసంతృప్తి వ్యక్తం చేశా రు.

ముఖ్యంగా నిర్మల్ బైంసాలో పార్టీ సీనియర్ నేతలైన మాజీ మున్సిపల్ చైర్మన్ గం డ్రత్ ఈశ్వర్, సారంగాపూర్ మాజీ జెడ్పిటిసి పత్తి రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి  సీనియర్ బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు దశరథం రాజేశ్వర్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ రాజేశ్వర్, మహిళా నాయకురాలు కృష్ణవేణి, అయ్యన్న గారి పోశెట్టి, ముదుళ్ళు రాజేశ్వర్ బాసరలో మరో ఇద్దరు నేతలు, భైంసాలో మరో ముగ్గురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసి ప్రతిపక్షంలో పార్టీని కాపాడుకున్న తమను కాదని ఇతరులకు ఎలా పదవులు ఇస్తారని పార్టీ అధిష్టానాన్ని పలు సందర్భాల్లో నిలదీశారు, కొన్ని కార్యక్రమాల్లో సీనియర్ నేతలకు సైతం పిలవడం లేదని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నిర్మల్ ముధోల్ నియోజకవర్గంలో నియోజకవర్గ నేతలు ఎవరికి వారే గ్రూపు లు కట్టి వారు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

దీంతో గ్రామస్థాయిలో ఉండే లీడర్లు ఎవరికి మద్ద తు ఇవ్వలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలి ముఖ్యమంత్రి పర్యటన బాసర అదిలాబాద్‌లో జరగగా కొంద రు నేతలకు వేదికపై ఆహ్వా నం పలకగా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న తమకు కనీసం పలకరింపులు చేయలేదని అసంతితో బహిరంగ సభ నుం చి తిరిగి వెనక్కి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని రాజకీయ చైతన్యం, అనుభ వజ్ఞులైన రాజకీయ నేతలు ఉన్న నిర్మల్ జిల్లాలో నేతలు తలోదారి కార్యకర్తలు మరో దారి పార్టీది వేరే దారి అనే రీతిగా చర్చించుకుంటున్నారు. పార్టీని సమన్వయంగా నడిపించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యేపై కూడా కొందరు నేతలు అసంత వ్యక్తం చేస్తున్నారు.

ఆయన అందర్నీ కలుపుకొని పోవడం లేదని ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పార్టీని నమ్ముకుని కష్టపడి పని చేస్తే తమకు గుర్తిం పు ఉండడం లేదని ఈ పార్టీలో పనిచేయ డం కన్నా వేరే దారి చూసుకోవడమే మిన్న అనే రీతిలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ దిక్కు చూస్తున్న స్థితిలో సతమతమవుతున్నారు 

ఇలా ఉంటే పార్టీకి నష్టమే..

నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టాన్ని కలిగించే అంశంగా చర్చనీయం అవుతుంది. ఇప్పటికీ మున్సిపల్ ఎన్నికలు త్వరగా నిర్మల్‌లో మెజార్టీ స్థానాలు తగ్గించుకున్న ఖానాపూర్ , భైంసాలో ఆ పార్టీకి అధి కారం దక్కలేదు. భైంసాలో ఒకే ఒక కౌన్సిలర్ గెలిచారు. ఖానాపూర్ లో ముగ్గురు కౌన్సిలర్లతో సరిపెట్టుకున్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మద్దతు దారులు కేవలం 50% లోపే విజయం సాధించారు ఇందులో 70% వారి సొంత ఎజెండాతోని గెలిచినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తుంది. అయి తే ఎన్నికలు గ్రామస్థాయిలో ఉండే లీడర్లకు ప్రతిష్టాత్మకం కావడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రామస్థాయి లీడర్లు ఇప్పటినుం చి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అయితే అన్ని మండలాలు రెండు గ్రూపులు ఉండటంతో ఒక గ్రూపుకు టికెట్ వస్తే మరో గ్రూ పు పని చేస్తుందా లేదా అనే అంశం ప్రశ్నార్థకంగా మిగులుతుంది. పార్టీలో విభేదాలు లేవని ఐక్యత ఉందని పదేపదే   పార్టీ అగ్రనేతలు ప్రకటించిన సందర్భంలోని అదే సభ లో క్రింది స్థాయి నేతలు కార్యకర్తలు నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని మార్చాలని వేడుకుంటున్నారు.

జిల్లాలో 154 ఎంపీటీసీ స్థానాలు 18 జడ్పిటిసిలు 18 ఎంపీపీ స్థానాలు ఉన్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటేనే జిల్లా చైర్పర్సన్ పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉందని లేకుంటే ప్రతిపక్షాలకు ఆ పదవి పోయే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు.

నిర్మల్ జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి సెంటిమెంటుగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పై ప్రత్యేక దృష్టి పెట్టి అందర్నీ ఐక్యత పరిచి సీనియర్ జూనియర్ తేడా లేకుండా కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తలకు గుర్తింపు ఇస్తే ఆ పార్టీకి ప్రయోజనం దక్కుతుందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు పార్టీ అధిష్టానం దీనిపై ఏ మేరకు దృష్టి పెడుతుందో వేచి చూడాల్సిందే.