27 April, 2026 | 1:52 AM

ఉట్నూర్ ఐటీడీఏ నూతన పీఓగా మకరంద్

27-04-2026 12:00 AM

ఉట్నూర్, ఏప్రిల్ 26 (విజయక్రాం తి):  ఉట్నూర్ ఐటిడిఏ  నూతన ప్రాజె క్టు అధికారిగా  మంద మకరందు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసిన ఐఏఎస్ అధికారుల  జాబితాలో హైదరాబాద్ జిహెచ్ ఎంసి లోకల్ కమిషనర్‌గా  విధు లు నిర్వహిస్తున్న  మంద మకరందు ఉట్నూర్ ఐటి డిఏ పీఓగా బదిలీ చేశారు.

ప్రస్తుతం ఉట్నూర్ ఐటిడిఏ ఇంచా ర్జి పిఓగా  విధులు నిర్వహిస్తున్న యువరాజ్ మార్మాట్‌ను కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా బదిలీ చేయడంతో కొమరం భీం జిల్లాకు వెళ్లారు. ఆయన స్థానంలో ఐటిడిఏ నూతన పిఓగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన నూతన పిఓకు ఐటీడీఏ అధికారులు, ఏపీఓ జనరల్ వసంత్ రావు జాదవ్, ఐటిడిఏ పరిపాలన అధికారి. ఇతర అధికారులు స్వాగతం పలికారు.