6 June, 2026 | 1:45 AM

విశిష్ట మహిళలకు నారీశక్తి అవార్డులతో ఘన సత్కారం

06-06-2026 12:00 AM

నారీశక్తి ఫోరంను ప్రారంభించిన డా.మొహమ్మద్ నిజాముద్దీన్

పంజాగుట్ట, జూన్ 5 (విజయక్రాంతి): సమాజాభివృద్ధి, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన మహిళలను గౌరవిస్తూ నిర్వహించిన నారీ శక్తి అవారడ్స్2026 కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. గోఆధ్ ఫౌండేషన్, భారత్ కే అన్మోల్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని హోటల్ మారిగోల్ లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతిభావంతులను సత్కరించారు.ఈ సందర్భంగా భారత్ కే అన్మోల్ వ్యవస్థాపకులు డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్ చేతుల మీదుగా నారీ శక్తి ఫోరమ్ ప్రారంభమైంది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. నిజాముద్దీన్ మాట్లాడుతూ మహిళల ధైర్యం, సంకల్పం, సేవాభావం దేశ ప్రగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి  సీనియర్ బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.అలాగే హైదరాబాద్లో జర్మనీ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్,ట్యునీషియా గౌరవ కాన్సుల్ షబానా సుల్తానా, యురేషియా ఆఫ్రో చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డా. రోహిత్ గుప్తా, డా. గీతా సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సేవలు, వైద్యరంగం, విద్య, వ్యాపారం, మీడియా, సామాజిక సేవ, కమ్యూనిటీ నాయకత్వం వంటి విభిన్న రంగాలకు చెందిన 35 మంది మహిళలను అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా రత్న ప్రభ,ఇందుకురి నిర్మల దేవిలకు జీవితకాల సేవలను గుర్తిస్తూ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. కార్పొరేట్ నాయకత్వం, మహిళా సాధికారత, సామాజిక ప్రభావం, కమ్యూనిటీ సేవ, జర్నలిజం, వ్యవస్థాపకత, ధైర్యసాహసాలు తదితర విభాగాల్లోనూ అవార్డులు అందజేశారు.