calender_icon.png 17 July, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

27-05-2025 12:00:00 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, కవాడిగూడ, ముషీరాబాద్ డివిజన్  లలో దర ఖాస్తు చేసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను (12 మందికి గాను రూ.  4,34000 ల చెక్కులను  లబ్ధిదారులకు అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి కోసం  దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.

ఈ పథకాన్ని పేదలు సద్వినియోగం  చేసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో   వివిధ డివిజన్ల అధ్యక్షులు కొండ  శ్రీధర్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, కార్యదర్శులు, సాయి కృష్ణ, దామోదర్ రెడ్డి, దీన్ దయాల్ రెడ్డి, ముచ్చ కుర్తి ప్రభాకర్,  శివ ముదిరాజ్, శ్రీధర్ చారి, రాజశేఖర్ గౌడ్, రాజేష్, వల్లాల రవి, బల్ల ప్రశాంత్, సంతోష్, వెంకటేష్, బల్వంత్ తదితరులు పాల్గొన్నారు.