27-05-2025 12:00:00 AM
కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి): డివిజన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం డివిజన్‌లో కొనసాగుతున్న ఇంజనీరింగ్ అభివృద్ధి పనులను కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్ సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీనగర్ డివిజన్ లో రూ. 26 లక్షల నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, డి ఎస్ రెడ్డి, ధోనేటి సత్యం, లక్ష్మీనారాయణ,స్థానిక కాలనీ వాసులు జయకుమార్, ప్రకాష్, శ్యామ్, రాజు, క్యలబ్ తదితరులు పాల్గొన్నారు.