27-05-2025 12:00:00 AM
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ చైర్మన్ సనాఉల్లా ఖాన్ డిమాండ్
ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి) : ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ము స్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ చైర్మన్ సనా ఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్రంట్ కన్వీనర్లు యాదగిరి, ముజాహిద్ యాష్మి, ఎస్.తన్వీ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ లతో కలిసి ఆయన మాట్లాడారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎస్సీ లు, ఎస్టీల కోసం ఉప ప్రణాళికలను రూపొందించి ఆమోదించాయని, కానీ వాటి అమలు చేయడంలో విఫలం చెం దాయని ఆయన ఆరోపించారు. యూపీ, ఎంపీల రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుందని ఆరోపించారు. పలు సమస్యలపై జూన్ 7 న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.