భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ
సికింద్రాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మొదటగా ఐదు మందికి నష్టపరిహారం చెక్కులు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలివేటెడ్ కారిడార్ ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్‌పేట్ వరకు రాజీవ్ రహదారి (ఎస్‌హెచ్01) నిర్మాణ నిమిత్తం ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఎండిఏ ప్రతిపాదనలను పురస్కరించుకొని భూసేకరణ చట్టం ప్రకారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ తదుపరి కారిడార్ నిర్మాణం నందు వారి ఇల్లు అలాగే తదితర స్థలాలు చట్టబద్ధంగా వారి ఇష్టానుసారం తీసుకొని పరిహారం అందించామన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ కదిరవన్ పలని, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ జితేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఈ. వెంకటాచారి,భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అపర్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




