కామారెడ్డిలో డ్యూయల్ డెస్క్ బెంచీల పంపిణీ
11-04-2026 02:21 AM
కామారెడ్డి, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఏర్పాటుచేసిన కెపి రాజారెడ్డి జన సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి డ్రైవర్స్ కాలనీలోని జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాలకు, డ్రైవర్స్ కాలనీ పాఠశాలలోని విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎమ్మెల్యే కా కాటిపల్లి వెంకటరమణారెడ్డి తమకు డ్యూయల్ డెస్క్ బెంచీలు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, కౌన్సిలర్లు నరేందర్ రెడ్డి, కుంట లక్ష్మారెడ్డి, భాను ప్రసాద్, బిజెపి నాయకులు విపుల్ జైన్, నేహాల్, వసిం, నవీన్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




