27-01-2026 12:00:00 AM
నేడు పట్టణములో బి.ఆర్.ఎస్ పార్టీ భారీ ర్యాలీ
వనపర్తి, జనవరి 26 ( విజయక్రాంతి ) : మనం చేసిన పట్టణ అభివృద్ధి మనకు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయం లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణ నాయకులకు,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన హయాములో కనివిని ఎరుగని రీతిలో పట్టణ అభివృద్ధి జరిగిందని 25నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఊసులేదు అభివృద్ధి లేక ఆర్థిక లావాదేవీలు లేక ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు.
అభివృద్ధి అనేది బి.ఆర్.ఎస్ కంటే ముందు బి.ఆర్.ఎస్ తర్వాత అనే విధంగా ప్రజల ఆలోచన ఉందని ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీనీ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. దశాబ్దాల ప్రజల కల రోడ్ల విస్తరణ,జిల్లా కేంద్రం,పార్కుల సుందరీకరణ, చెరువుల దురస్తూతో పట్టణం చూడ ముచ్చటగా తయారు అయ్యిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇంచార్జి స్వామి గౌడ్ మాజీ ఎం.ఎల్.సి ముఖ్య అతిథిగా మంగళవారం ఉదయం 10.00గంటలకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.