calender_icon.png 19 December, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

19-12-2025 08:38:29 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా పాలకవర్గం సమావేశం శుక్రవారం రెడ్ క్రాస్ భవన్లో  నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 23 మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సర్వసభ్య సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను కార్యక్రమ నిర్వహణ విధానంపై విస్తృతంగా చర్చించారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ ని కలెక్టర్ కార్యాలయంలో హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం సర్వసభ్య సమావేశానికి సంబంధించిన బుక్ లేట్ ను కలెక్టర్ కు అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ జిల్లా డిఎంహెచ్వో ఏ.అప్పయ్య, రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు స్వయంగా 30 మంది టీబీ (క్షయ) వ్యాధిగ్రహస్తులకు ఉచితంగా పౌష్టికాహార పదార్థాలు, కోడిగుడ్లు, నిత్యవసర సరుకులతో కూడిన న్యూట్రిషన్ కిట్ల ను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి శ్రీనివాసరావు, సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ కే. సుధాకర్ రెడ్డి, డాక్టర్ సిహెచ్. సంధ్యారాణి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి కె. హిమబిందు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.