26 April, 2026 | 9:07 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ప్యాడ్‌ల పంపిణీ

05-03-2026 12:43 AM

సుల్తానాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచితంగా పరీక్ష ప్యాడ్స్ అందించారు. బుధవారం పట్టణంలోని.. జెడ్ పి ఎస్ ఎస్ బాలుర మరియు బాలికల అలాగే. జి జె సి  హై స్కూల్ సుల్తానాబాద్ నందు పాడ్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వంతోపాటు వివిధ స్వచ్ఛంగా సంస్థలు అన్ని విధాల అండగా ఉంటున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు.. బుర్ర ఓంకార్ గౌడ్. కోశాధికారి తుమ్మ వెంకటేశం. . ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్. దేవసాని సన్నీ. శ్రీనివాస్. ఎల్లా మల్లేశం. ప్రధానోపాధ్యాయులు. పద్మశ్రీ.. టి దివాకర్ రావు. S .రత్నాకర్ రెడ్డి. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..