5 March, 2026 | 2:13 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

05-03-2026 12:41 AM

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆర్టీసీ జేఏసీ వినతి

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఈ మేరకు జేఏసీ, ఆర్టీసీ వివిధ సంఘాల నాయకులు ఈ.అశ్వత్థామ రెడ్డి, మర్రి నరేందర్, ఎర్ర స్వామికుమార్, పున్న హరికిషన్, రామావతారం తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

తమ డిమాండ్లను పరిష్కరించుకుటే ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటిస్తామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు మంత్రి స్పందిస్తూ 15 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.