5 March, 2026 | 2:13 AM

3 నెలల రేషన్ ఒకేసారి

05-03-2026 12:43 AM
  1. ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలి 

రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు 

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): రేషన్‌కార్డుల ద్వారా పంపిణీ చేసి బియ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వేసవి కాలం దృష్ట్యా మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధిం చిన రేషన్ బియ్యం ఏప్రిల్ నెలలో ఒకేసారి పంపి ణీ జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.

మార్చి మొదటి వారంలో ఎండలు మండిపోతున్నాయని, రాబోయే రోజుల్లో ఉష్టోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంద ని, వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాగా, దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు.

ఒక్కో లబ్దిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పుడ్ సెక్యురి టీ కార్డుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 1,05,7879 రేషన్ కార్డులకుగాను 3.09 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు. ప్రతి నెల 2.13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. 

మూడు నెలలకుగాను 6.39 లక్షల మెట్రికట్ టన్ను ల బియ్యం పంపిణి చేయాల్సి ఉంది. ఒకేసారి మూడు నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్య సాధ్యాల ను తెలంగాణ ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. అయితే ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం సరఫరా చేయాలని కేంద్రం యోచిస్తుండగా, గత అనుభవాలను దృష్ట్యా అనేక సమస్య లు ఎదురయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 

సర్వర్ సమస్యలు ఉత్పన్నమైతే.. 

గతేడాది వర్షాకాలంలో ఒకే దఫా మూడు నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమమయంలో ఇటు లబ్దిదారులు, అటు రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందుల కు ఎదుర్కొన్నారు. మూడు నెలలకు సంబంధించిన బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో డీలర్లకు సమస్యగా మారింది. ఇక మూడు నెలలకు సం బంధించి ఒక్కో కార్డుదారుడు మూడుసార్లు వేలి ముద్ర వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వర్ సమస్యలు ఉత్పన్నమైతే ఒక్కో కార్డుకు దాదాపు 10 నుం చి 15 నిమిషాల టైమ్ పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది.