calender_icon.png 20 August, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్కల్ లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

19-08-2025 11:22:18 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో మంగళవారం మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతినిధులు 30 మంది మహిళలను ఎంపిక చేసి వారికి ఉచితంగా కుట్టుమిషన్లను అందించారు.

ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్య సంస్థ మేనేజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ... గ్రామ స్వరాజ్య సంస్థ ద్వారా ఈ కుట్టు మిషన్ లు అందించినట్లు తెలిపారు. కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మహిళల నైపుణ్యతను పెంపొందించడానికి కృషి చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామ సమాఖ్య సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్,ప్యాషన్ డిజైనర్ల శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.