calender_icon.png 20 August, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాల బ్రిడ్జి నుండి చౌటుప్పల్ రోడ్డు వరకు బైపాస్ నిర్మాణం చేపట్టాలి

19-08-2025 11:15:09 PM

గ్రామాలలో పారిశుద్ధ్యం కుంటుపడింది

సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బండ శ్రీశైలం

మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు నుండి చిట్యాలకు వెళ్లే  రహదారిలో ఉన్న బ్రిడ్జ్ వద్ద నుండి చౌటుప్పల ప్రధాన రహదారికి బైపాస్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. మంగళవారం  ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని వార్డులోని ఇంటింటికి తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు.

మునుగోడు నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. పలు వీధుల్లో మురికి కాల్వాల నిర్మాణం లేకపోవడంతో  మురికి నీరు ఎక్కడికి అక్కడ నిలిసిపోయి గ్రామ ప్రజలు వ్యాధిన బారిన పడుతున్నారు అని ఆరోపించారు. రజక కాలనీలో , చండూరు రోడ్డులోని చిక్కుల నరసింహ ఇంటి నుండి లక్ష్మీదేవి గూడెం వరకు సీసీ రోడ్డు తో పాటు రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువ నిర్మాణం చెప్పటాలని డిమాండ్ చేశారు.

రజక కాలనీతో పాటు రెండో వార్డులో కృష్ణా జలాలు రాక తాగునీటి కోసం గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. నల్గొండ నుండి చౌటుప్పల్ కు వెళ్లే రహదారి, మునుగోడు నుండి చండూరుకు వెళ్లే నాలుగు వరుసల రహదారుల నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయని అన్నారు. నిర్మాణ పనులలో ఆలస్యం జరగకుండా పనులను వేగవంతం చేసి పెండింగ్ పనులను పూర్తి చేయాలని అన్నారు.

అప్పుడే నిర్మాణం చేసేటట్టుగా అధికారులు వ్యాపారులను నష్టం కలిగించే విధంగా నిర్మాణాలను కూల్చివేసి నెలలు గరుస్తున్న నిర్మాణ పనులలో జాప్యం జరుగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. గ్రామంలోని 14 వార్డులలో సీజనల్  వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వీధులలో  సీసీ రోడ్లు లేని వీధులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసి , వీధుల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులకు సూచించారు . ప్రజలు వ్యాధుల బారిన పడకుండాకాలనీలలో వారానికోసారి దోమల మందిని పిచికారి చేయాలని కోరారు.