19-08-2025 11:25:20 PM
స్వాగతం పలికిన కార్యాలయం సిబ్బంది
మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడులో విధులు నిర్వహించి మరో చోటుకి బదిలీ అయిన ఇంచార్జ్ ఎంపీడీవో విజయభాస్కర్ స్థానంలో నూతన మండల పరిషత్తు అభివృద్ధి అధికారి జి.యుగేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆయనకు కార్యాలయ సిబ్బంది శాలువా పుష్పగుచ్చములతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరం సమన్వయంతో గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి సమస్యల రహిత మునుగోడు మండలంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని అన్నారు.