7 March, 2026 | 8:59 AM

పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య కిట్లు పంపిణీ

07-03-2026 01:58 AM

బెజ్జంకి, మార్చి6: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కళ్ళేపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య సామాగ్రి కిట్లను సోమవారం గ్రామ సర్పం చ్ బిగుళ్ళ మోహన్ ఆధ్వర్యంలో పాలకవర్గంతో కలిసి అందజేశారు. గ్రామ పరిశు భ్రత కోసం శ్రమిస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కిట్లను పంపిణీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శేషి వినీత్, గ్రామ కార్యదర్శి రాకేష్,వార్డు సభ్యులు మంకాల మోహన్, విజయ , నిషాని అనిల్, ఒగ్గు కానుకయ్య, వేదిరే రాజయ్య, మనీషా, తదితర గ్రామపంచాయతి సభ్యులు పాల్గొన్నారు.