13-01-2026 10:30:36 PM
వెలిదండలో గృహజ్యోతి పత్రాల పంపిణీ చేస్తున్న సర్పంచ్
గరిడేపల్లి,(విజయక్రాంతి): గృహ జ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ భారం పడకుండా ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత కరెంటు అందిస్తుందని వెలిదండ గ్రామ సర్పంచ్ చనగాని సాంబయ్య గౌడ్ అన్నారు. గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు గృహజ్యోతి పత్రాలను గ్రామస్తులకు మంగళవారం పంపిణీ చేశారు.
ప్రభుత్వం అర్హులైన వారందరికీ గృహ జ్యోతి పథకం కింద కరెంటు ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం ఉండేవిధంగా గ్రామపంచాయతీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ సాంబయ్య తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.