4 June, 2026 | 3:20 AM

మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలి

04-06-2026 02:38 AM

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం రావు...

ఆదిలాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) : రాజకీయంగా మున్నూరుకాపులు మరింతగా రాణించాల్సిన అవసరం ఉందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం రావు అన్నారు. బుధవారం తాలూక మున్నూకారు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సంఘ భవనంలో నిర్వహించిన ఈ వేడుకకు మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతలతో కలిసి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఆనంతరం నూతన సభ్యులతో ప్రమాణ స్వీకరం చేయించారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను పలువురు శాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం రావు మాట్లాడుతూ.... 1931లో నిజాం కాలంలో జరిగిన జన గణనలో మున్నూరు కాపులు 8 లక్షల మంది ఉంటే ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించిన గణనలో 13 లక్షల మంది ఉన్నట్లు తెలిందన్నారు. ప్రతి ఒక్కరు గ్రామం, మండలంలో ఉన్న కుల సభ్యుల వివరాలను సేకరించాలన్నారు. దాని ఆధారంగానే భవిష్యత్తులో పదవులు వస్తాయన్నారు.