22-08-2025 01:57:35 PM
హైదరాబాద్: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Thermal Power Plant) నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు(Job recruitment documents) అందించే కార్యక్రమాన్ని ప్రజాభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. వీర్లపల్లిలో 335 మంది భూ నిర్వాసితులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. జెన్ కోలో జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం((Bhatti Vikramarka)) మాట్లాడుతూ... ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని సూచించారు. విద్య ద్వారా సామాజిక, ఆర్థిక వెనుకబాటును జయించవచ్చని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, సీఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగం ఇండియా స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. 2600 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్సు ఏర్పాటు చేస్తామన్నారు. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో వెళ్తోందని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వచ్చాక ఎనర్జీ పాలసీ తీసుకువచ్చామని చెప్పిన భట్టి విక్రమార్క రెప్పపాటు కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కన్వెన్సన్, నాన్ కన్వెన్షన్ ఎనర్జీ అందించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో అత్యధిక గ్రీన్ పవర్ ఉత్పత్తి(Green power generation) చేస్తున్న రాష్ట్రంగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని, 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన తెలిపారు.