calender_icon.png 17 November, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిల్డ్రన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు

16-11-2025 12:00:00 AM

ముషీరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): 2025 బాలల దినోత్సవం సంద ర్భంగా విద్యా, కళలు, అథ్లెటిక్స్లో అంతర్జాతీయంగా, జాతీయంగా అత్యంత ప్రతిభ కనబరిచిన ఐదు మంది విద్యార్థులకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనుబంధ సంస్థ అయిన చిల్డ్రన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

ఈ మేరకు నాయిస్ మేకర్స్ ఈవెంట్స్ సంస్థ సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికారడ్స్ న్యాయనిర్ణేతలు డా. పావని, డా. సరయు దేవభక్తుని చిల్డ్రన్ బుక్ ఆఫ్ రికారడ్స్ లో చోటు దక్కిన విద్యార్థిని విద్యార్థులు డెహ్రాడూన్లోని ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన మిష్కా అగర్వాల్ కు ది గ్లైడింగ్ గ్లోరీ అవార్డును,

సిబిఎస్‌ఈ క్లస్టర్ గోల్ మెడలిస్ట్గా అథ్లెటిక్స్లో అత్యుత్తమ విజయానికి, జాతీయ టాప్ 5 అథ్లెట్లలో స్థానం సంపాదించినందుకు బర్ధవల్ శివ శంకర్ కు ది స్ప్రింటింగ్ స్టార్ అవార్డు ను, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి డిజైన్ ఛాంపియన్షిప్ (సౌత్ జోన్)లో మొదటి స్థానాన్ని పొందిన అదితి సోమకు ది విజనరీ డిజైనర్ అవార్డును, రాష్ట్ర, జాతీయ స్థాయిలో భరతనాట్యంలో నైపుణ్యం ప్రదర్శించిన కీర్తన రెడ్డి మడమడకలకు కల్చరల్ హార్మనీ అవార్డు ను,

అంతర్జాతీయ పాఠ్యాంశాల యొక్క పదవ తరగతి బోర్డు పరీక్షలలో అన్ని సబ్జెక్టులలో ఎ (స్టార్) సాధించినందుకు ఆరుషి ముదిగొండ కు ది అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ను, సర్టిఫికెట్ లను హైదరాబాద్ గుండ్ల పోచంపల్లి డిఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసారు. ఈ సందర్బంగా డిఆర్‌ఎస్ ఐఎస్ ప్రిన్సిపాల్ ఐ. వేణుగోపాల్ విజేతలను అభినందించి మాట్లాడుతూ.

ఈ వేడుక విద్యా ర్థుల యొక్క ఆనందకరమైన సారాన్ని క్రీడా, సంగీతం, సృజనాత్మకతను పెంపొదిస్తుందని, విద్యార్థులలో దాగి ఉన్న సృజన శక్తి, పరిశోధనలు రేపటి భవిష్యత్తుకు పునాదులు వేస్తాయని అన్నారు. విద్యా, కళలు, అథ్లెటిక్స్ రంగాలలో రాణించడాన్ని డిఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఎస్ ఐఎస్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్, రెసిడెన్సియల్ హెడ్ రాజేందర్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ పూజ సక్సేనా, అడ్మిన్ హెడ్ వినోద రంజన్ తదితరులు పాల్గొన్నారు.