9 June, 2026 | 5:07 PM

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

09-06-2026 04:30 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం  కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలానికి చెందిన మొత్తం 89 మంది లబ్ధిదారులకు రూ.89,35,353 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ ఖర్చుల భారం తగ్గించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామాల లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.