calender_icon.png 14 January, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఆలోచనే కళ్యాణ లక్ష్మి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

14-01-2026 05:00:08 PM

జైనూర్,(విజయక్రాంతి): పేదంటి ఆడబిడ్డల కు పెళ్లి కానుకగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సిర్పూర్ యు, జైనూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమైందని ఆరోపించారు. పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇవ్వడంలేదని విమర్శించారు. గ్యారంటీల ఆశ చూపి అధికారంలోకి వచ్చాక విమర్శించాలని ఎద్దేవా చేశారు. అర్హులైన వారికి పథకాలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, జైనూర్ సర్పంచ్ కడప ప్రకాష్, బిఆర్ఎస్ పార్టీ మండల ఆద్యుక్షుడు ఇంతియాజ్ లాలా,  ఉప ఆద్యుక్షుడు ఆత్రం శంకర్ , నాయకులు జాధవ్ శ్రవణ్,  సతీష్, కేంద్ర విశాల్ తదితరులు పాల్గొన్నారు