03-07-2025 02:29:05 AM
ఎల్లారెడ్డి, జూలై 2(విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాఎల్లారెడ్డి నియోజకవర్గ వర్గం నాగిరెడ్డిపేట్ మండలంలోని పల్లెబొగుడ తండా గ్రామంలో బుధవారం కాంగ్రెస్ నాయకులు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు చెప్పి పంపించేసినట్లు తెలిపారు. ఐదుగురు లబ్ధిదారులు లకవత్ గాయత్రీ, దేవసొత్ వినోద, దేవసోత్ శిరీష, ధనవత్ శిరీష, ధనవత్ సరస్వతి వాళ్లకి రూ.1,00,116 చొప్పున ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ గౌడ్ , PACS డైరెక్టర్ బాన్సీ నాయక్, గ్రామ అధ్యక్షుడు నంద్య నాయక్, రావుజా నాయక్, విఠల్ నాయక్, ఏ. శంకర్ నాయక్, ఏ. సంగు నాయక్, చండు నాయక్, డి. పీర్య నాయక్, ఎల్. లచ్చు నాయక్, జీల్య నాయక్ తదితరులు పాల్గొని లబ్ధిదారుల గడపల వద్దకు వెళ్లి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం వల్ల కాంగ్రెస్ నాయకులను లబ్ధిదారులు అభినందించారు.