03-07-2025 02:28:13 AM
దివ్యాంగులకు కల్పిస్తున్న సేవలపై తృప్తి
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య బుధవారం కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా రంగారెడ్డిలోని జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేథో వైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెరిబ్రల్ పాల్సీ, మల్టిపుల్ డిజేబిలిటీస్, ఎడిహెచ్‌డీ, లెర్నింగ్ డిజేబిలిటీస్, లోకోమోటర్ డిజేబిలిటీస్, డౌన్ సిండ్రోమ్ మొదలైన వాటి కోసం దివ్యాంగులకు అందజేస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
డిజేబిలిటీ, క్లినికల్ సైకాలజీ, స్పీచ్ థెరపీ, సమగ్ర పునరావాస సేవలు, చికిత్సా సేవలపై ఆయన సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ కమ్యూనిటీలలో దివ్యాంగుల గుర్తింపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే నేషనల్ ట్రస్ట్ సహకారంతో యుడీఐడీ కార్డులు, నిరామయ ఆరోగ్య బీమా కార్డులను జారీ చేయడంలో శ్రద్ధ వహించాలని చెప్పారు.
రంగారెడ్డితో పాటు జిల్లాకో డీడీఆర్సీల ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్‌రెడ్డిని, డిప్యూటీ సీఎం మల్లు భట్టిని, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లను కోరుతామని చెప్పారు. రంగారెడ్డికి మరిన్ని నిధులు ఇవ్వాలని ప్రభుత్వ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయనవెంట నోడల్ ఆఫీసర్ పి రమేష్ ఉన్నారు.