calender_icon.png 4 July, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

03-07-2025 02:30:20 AM

ఏఐటీయూసీ, హమాలి సంఘ నేతలు ముందస్తు అనుమతి కోసం వినతి

కామారెడ్డి అర్బన్, జూలై 2 (విజయ క్రాంతి):ఈనెల తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారికి సివిల్ సప్లై హమాలి నాయకులు బుధవారం  సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియూసి కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రాజు మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని ఈ సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమ్మెలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, సదాశివనగర్, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం ఎం ఎల్ ఎస్ పాయింట్ లలో పనిచేస్తున్న హామాలీలు పాల్గొంటున్నట్లు తెలిపారు.  కనీస వేతనాలు, పని భద్రత, పిఎఫ్, ఈ ఎఫ్ ఐ,  మహిళా కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.  అన్ని రంగాలు 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీ ఏఐటీయూసీ అనుబంధ సంఘాలు, జిల్లా అధ్యక్షులు దశరథ్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలరాజు, సివిల్ సప్లై హమాలి, కామారెడ్డి జిల్లా నాయకులు బాజీ మహిపాల్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.