27-01-2026 03:54:37 PM
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంలో కాంట్రాక్టర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు అంకితభావంతో పని చేయాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కాంట్రాక్టర్ల సహకారం మరింత అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఆలంపల్లి నర్సింహ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ గారు, మల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ డా. వేణుందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి, అనంతగిరి, SPDCL కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు గాజుల శ్రీనివాస్, సంతోష్, జువ్వ శ్రీనివాస్, బి. సైదులు, సైదులు, యాదయ్య, హనుమ, మున్న, యాదయ్య, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.