21 March, 2026 | 1:36 AM

పట్టాలపైనే ఆగిపోయిన మెట్రో

21-03-2026 12:00 AM
  1. సాంకేతిక లోపంతో మార్గమధ్యలోనే ఆగిన రైళ్లు
  2. అరగంట పాటు ప్రయాణికుల అవస్థలు
  3. నాగోల్ మార్గంలో నిలిచిపోయిన మెట్రో సేవలు

హైదరాబాద్,సిటీ బ్యూరో మార్చి 20 (విజయక్రాంతి): నిత్యం లక్షలాది మందితో రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు శుక్రవారం ప్రధాన మార్గంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌ను కలిపే నాగోల్ రాయదుర్గం మార్గం లో ఈ సమస్య తలెత్తడంతో మెట్రో సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. సాంకేతి క సమస్య తలెత్తిన సమయంలో పలు రైళ్లు స్టేషన్లలో కాకుండా, మార్గమధ్యలో ట్రాక్‌పైనే ఆగిపోయాయి.

ఉన్నపళంగా రైళ్లు నిలి చిపో వడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏంజరిగిం దో తెలియక, రైలు దిగే అవకాశం లేక కోచ్‌లోనే ఉం డి ఇబ్బందులు పడ్డారు. ఉదయం సమయంలో ఆఫీసులకు, ఇత ర ముఖ్యమైన పనులకు వెళ్లే వారు సకాలం లో గమ్యస్థానాలకు చేరుకోలేక నానా అవస్థలు ఎదుర్కొన్నా రు. రైళ్లు నిలిచిపోయిన వెం టనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది, సాంకేతిక నిపుణులు హుటాహుటిన రంగంలోకి దిగారు.

సుమా రు 30 నిమిషాల పాటు శ్రమించి సాంకేతిక లోపాన్ని సరిదిద్దారు. మరమ్మతుల అనంతరం మెట్రో రైళ్ల రాకపోకలు మళ్లీ యథా విధిగా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊ పిరి పీల్చుకున్నారు. కేవలం సాంకేతిక లో పం వల్లే అంతరాయం ఏర్పడిందని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.