3 July, 2026 | 9:28 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

30 వరకు రేషన్ సరుకుల పంపిణీ

10-06-2025 12:00 AM

అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్

కరీంనగర్, జూన్ 9 (విజయ క్రాంతి): మూడు నెలలకు సంబంధించిన రేషన్ బి య్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నందున ఈ నెల 30 వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని, రేషన్ కార్డుదారులందరికీ బియ్యం పంపిణీ చేస్తామని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్ర భుత్వం జూన్, జూలై, ఆగస్టు నెలలకు సం బంధించిన మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు.

ప్రతి నెలా 15వ తేదీ వరకు రేషన్ సరుకులు ఇస్తారని, కానీ ఈ నెలలో మూడు నెలల బియ్యం పం పిణీ చేస్తున్నందున జూన్ 30 వరకు బి య్యం పంపిణీ చేస్తామని అన్నారు.  ఆహార భద్రత  కారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు ఉచితంగా బి య్యం ఇస్తామని, అంత్యోదయ కార్డుదారులకు నెలకు 35 కిలోల చొప్పున మూడు నెలల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.

అన్నపూర్ణ కార్డుదారులకు నెలకు 10 కిలోల చొప్పున మూడు నెలలకు ఉచితంగా బియ్యం పంపిణీ ఉంటుందని పేర్కొ న్నారు. అంత్యోదయ కార్డుదారులకు నెలకు ఒక కిలో చక్కెర చొప్పున మూడు నెలలకు పంపిణీ చేస్తామని, కిలోకు 13.50 రూపాయలు కార్డుదారులు చెల్లించాలని  అడిషన ల్ కలెక్టర్ పేర్కొన్నారు.