ఏండ్ల తరబడి రాస్తూనే ఉంటారా?
- తీగల చెరువులో నీరు ఎందుకు నిలవట్లేదు
- నేషనల్ హైవే కాంట్రాక్టర్ కొంత కట్ట ద్వసం చేసిన వైనం
- ఉన్నత అధికారులకు లేఖ రాశాం : అబు సిద్ధికి అన్సారీ
మహబూబ్‌నగర్ జూన్ ౯ (విజయ క్రాంతి) : ఎక్కడైనా చెరువు నిండితే ఆ చెరువుకు ఉన్న అలుగు ద్వారా నీరు బయటకు పారుతుంది. కాగా జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న భూత్పూర్ మండలం అ మిస్తాపూర్ గ్రామంలో ఉన్న తీగల చెరువు లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.
ఈ చెరువులోకి కొంత నీరు వచ్చిన వెంటనే నీ రు తూము ద్వారానే నిరంతరం బయటికి ఎప్పటికప్పుడు పోతూనే ఉంది. దీంతో చెరువులో నీరు నిలువలేకపోతుంది. ఈ నేపథ్యం లో చెరువులో నీరు ఉండవలసింది పోయి పిచ్చి మొక్కలు పెరిగి కంపచెట్లు దర్శనమిస్తున్నాయి. పూర్తిగా ఎడారిగా మారి చెరువు కాదేమో అనే రీతిగా తయారైంది.
గత కొన్ని నెలలుగా మత్స్యకారులకు సైతం ఈ చెరువు లో నీరు లేకపోవడంతో చేపల పెంపకం కూ డా జరగడం లేదు. ఏండ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం ఉన్నదా అధికారులకు లేఖ లు రాస్తున్నాం ఆదేశాలు వచ్చిన వెంటనే మ రమ్మత్తు పనులు చేపడతామని చెప్పడం వి డ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
శిఖం భూములు ఉన్నవారే కారణమా...?
చెరువు నీటి పరివాహక ప్రాంతం అయినటువంటి శిఖం భూములో పట్టాలు ఉన్న కొంతమంది రైతులు ఆ చెరువులో నీరు ఉం డకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తూము ద్వారా ఎప్పటికప్పుడు నీరు బయటకు పం పిస్తున్నారే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ ప్రక్రియ కొన్ని యేండ్ల నుంచి కొనసాగుతున్నప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులు నిత్యం తిరుగుతున్న నియంత్రించే చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
అన్ని విషయా లు తెలిసిన చెరువులో నీరు ఉండే విధంగా తీసుకోవలసిన చర్యలు మాత్రం తీసుకోకుండ నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ చేస్తున్న ఎలాం టి ఫలితం లేకుండా ఉంది. అక్కడ వె ళ్లాం ఇక్కడ వెళ్ళామని అధికారులు ప్రత్యేక వాహనాలను పెట్టుకొని కూడా ప్రభుత్వ సదుపా యాలు కల్పిస్తున్న చేయవలసిన పనులు మాత్రం చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?
అధికారులు పర్యవేక్షణ చెరువులపై ఉందా లేదా అనే అనుమానం రాక తప్ప డం లేదు. నిత్యం ప్రధాన రోడ్లపై ఉన్న చెరువులో ఇలాంటి పరిస్థితులు ఉండడంతో పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అమిస్తాపూర్ గ్రామంలోని బోడమోని చెరువులో ఎఫ్టిఎల్ ప్రాంతంలో వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లుగా మార్చిన అటువైపు అధికారులు చూడడమే మానేశారు.
అలుగు కాలువ సై తం కొందరు కబ్జా చేసిందని ఆరోపణలు బలం గా ఉన్నాయి. అధికారులు మాత్రం అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులను కాపాడడంలో సంబంధించి అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అమిస్తాపూర్ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- చెరువులో చేపల పెంపకం లేనట్లే...
కొండలుగా ఈ తీగల చెరువులో చేపల పెంపకం కూడా జరగడం లేదు. నేషనల్ హైవే కు సమీపములో తీగల చెరువు ఉండడంతో తీగల చెరువు కు ఉన్న ఎఫ్ పి ఎల్, బఫర్ జనులలో ఉన్న భూములకు భలే డిమాండ్ ఉంది. దీంతో ఆయా ప్రాంతాల పట్టాదారులకు సైతం ఈ తీగలచెరువులో నీరు ఉండకుంటేనే బాగుండే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.
అధికారులు చెరువులను కాపాడి భూగర్భ జలాలు పెంపకంతోపాటు చేపల పెంపకానికి కూడా చెరువులు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. ఈ తీగల చెరువులో మాత్రం నీరు ఉండకపోవడంతో ఎ లాంటి ఉపయోగం లేకుండా పోయింది.
ఉన్నత అధికారులకు లేఖ రాశాం
తీగల చెరువుకు సంబంధించి పూర్తి గా కాపాడేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. కొంత కట్ట భూభాగాన్ని నేషనల్ హైవే కు సంబంధించి కట్ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో మరమ్మతు చేసేందుకు నేషనల్ హైవే అథారిటీకి లేఖ రాయడం జరిగింది. పూర్తిస్థాయిలో తీగలచెరువు ను యధావిధిగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. సం బంధిత అధికారుల నుం చి ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం.
అబు సిద్ధికి అన్సారీ:
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,
నీటి పారుదల శాఖ, మహబూబ్ నగర్






