చిన్నారులకు పరీక్ష అట్టల పంపిణీ
28-05-2026 12:00 AM
బోధన్, మే 27 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమై మూడు సంవత్సరాల అయిన సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణంలో ఆరుగురు చిన్నారులు ప్రతిభను చాటారు.
ఈ సందర్బంగా చిన్నారులకు ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ పరీక్ష అట్టలు,స్కేల్, పెన్నులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, విజయ్, దత్తాత్రి, రవికాంత్ సిరిగిరి నాగనాథ్, రమేష్, బద్ధం సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రవీణ్ మహారాజ్ మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణంలో ప్రతిభను చాటిన ప్రతి ఒక్కరికి కూడా మన దేవాలయంలో బహుమతి ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా నేర్చుకొని ప్రతిభని చాటాలని కోరారు.






