దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ
నస్పూర్, జూలై 1 : శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జీఎం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగరేణి ప్రభావిత గ్రామాల్లోని దివ్యాంగులకు బుధ వారం జీఎం మునిగంటి శ్రీనివాస్ ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని వివిధ గనుల రెమిడియేషన్ ప్లాన్ లో భాగంగా ప్రభావిత గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు కనీస మౌళిక వసతులు కల్పిస్తున్నామని, ఇందులో భాగంగా ఆర్కే 8 గని రెమిడియేషన్ ప్లాన్ లో భాగంగా గుడిపెల్లి, కాన్కూర్, రామారావుపేట, ఇందారం గ్రామాల్లో గుర్తించిన 21 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేస్తున్నామన్నారు.
ఇప్పటికే గ్రామాల్లో ఆర్‌ఓ ప్లాంట్లు, ఓపెన్ జిమ్ లు, బోర్ వెల్స్, సోలార్ లాంప్ లు, ఫంక్షన్ హాల్స్ నిర్మించామని, మరికొన్ని ఏర్పాటు దశలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, సర్పంచ్ లు ఫయాజ్(ఇందారం), వెంకటేష్(కాన్కూర్), వెంకటేష్(గుడిపెల్లి), రాజశేఖర్ (రామారావు పేట), డీజీఎం(ఫారెస్ట్) హరినారాయణ, ఎన్విరాన్ మెంటర్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, ఎస్టెట్స్ (మేనేజర్) వరలక్ష్మి, పిట్ సెక్రటరీ సందీప్, తదితరులు పాల్గొన్నారు.






