2 July, 2026 | 3:13 AM

‘ఎస్‌ఐఆర్’ను పారదర్శకంగా నిర్వహించాలి

02-07-2026 02:08 AM

ఫారాల పంపిణీని పరిశీలించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్

కోరుట్ల, జులై 1(విజయక్రాంతి):ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగాసమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.బుధవారం కోరుట్ల పట్టణం కేంద్రంలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి  పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ హకీమ్,సంబంధిత సిబ్బంది, బీఎల్వోలు మరియు తదితరులు పాల్గొన్నారు.