calender_icon.png 21 June, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమన్వయమే యోగ..!

21-06-2025 02:26:19 PM

యోగా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్.

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): శరీరం, మనస్సు, ఆత్మల మధ్య యోగ సమన్వయం చేస్తుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథలు అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి రోజు ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని సూచించారు. వారితోపాటు ఏఎస్పీ రామేశ్వర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలోనూ యోగా డే ఘనంగా నిర్వహించారు.