నవోదయకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
19-03-2026 12:54 AM
అయిజ, మార్చి 18; జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలోని ఆదర్శ హై స్కూల్ విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షలు రాయగా 30 మందిలో 16 మంది విద్యార్థులు ఎంపిక కావ డంతో బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ విద్యార్థులను అభినందించారు. ఈ మేరకు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు జిల్లా కలెక్టర్ ను కలిసి శాలువాతో సన్మానించి పూల బొకే అందజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ర్యాం కులు సాధించాలన్నారు. నవోదయ ప్రవేశం పొందడం చాలా కష్టమని అలాంటి 16 మంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించా రు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




