19 March, 2026 | 7:10 AM

నాడు బురదమయం.. నేడు సజావుగా పయనం..

19-03-2026 12:55 AM

వెంపటిలో వీధికి మట్టి పోయించి శుభ్రం చేయించిన సర్పంచ్... సర్పంచ్ ఎల్లయ్య చొరవ పట్ల గ్రామస్తుల హర్షం

తుంగతుర్తి, మార్చి 18 : కొన్ని సంవత్సరాలుగా మండలంలోని వెంపటి గ్రామంలో ఓ వీధిలో ఎల్లకాలం బురదమ యంగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారుతుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంపటిలోని 8, 9వ వార్డులలో వీధి వర్షం పడితే నీరు నిలిచి పరిస్థితులు దయనీయం గా మారుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రావడం కూడా కష్టమయ్యేది.

దీనితో దోమలు వృద్ధి చెంది, రోగాల బారిన  పడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక ఈ వీధిలో వాహనదారుల ప్రయాణం కూడా ఇబ్బందికరమే. ఈ సమస్యను గుర్తించిన నూతన సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు, వార్డు సభ్యురాలు దేశబోయిన కేతమ్మ స్పందించి, బురదతో నిండిన వీధిలో మట్టి పోయించి డోజర్ తో చదును పనులను శ్రీకారం చుట్టారు. దీంతో వీధి సమస్య తీరిపోయింది.

నా హృదయమయంగా ఉన్న వీదిలో నేడు ప్రయాణం సజావుగా సాగుతుందంటూ వార్డు సభ్యులు ఆనందంతో చెబుతున్నారు. ఇన్నేళ్లుగా ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోని వీదికి మట్టి పోయించి సమస్యను తీర్చిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు.