calender_icon.png 20 August, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ దుకాణాన్ని పరిశీలించిన జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్

20-08-2025 12:24:46 AM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిలోని మెడికల్ దుకాణాన్ని జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేందర్ పోలీస్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆర్ఎంపీ వైద్యుడు చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందడంతో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరిశీలనకు వచ్చారు. దీంతో మృతికి కారణమైన ఎలాంటి మందులు ఉపయోగించారో క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తి నివేదికన జిల్లా అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. వారి వెంట సీఐ నరసింహారావు, ఎస్ఐ క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.