20-08-2025 12:27:20 AM
కొండపాక: కొండపాక మండలం తాజా మాజీ జెడ్పిటిసి అనంతుల అశ్విని ప్రశాంత్ ఉస్మానియా యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్టులో రీసెర్చ్ చేసినందుకు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ డాక్టరేట్ పట్టా మంగళవారం అనంతుల అశ్విని ప్రశాంత్ కు అందజేశారు. జడ్పిటిసి గా ప్రజలకు సేవ చేస్తూ, అటు తను చదువుకుంటూ డాక్టరేట్ పట్టా పొందారు. డాక్టరేట్ పట్టా పొందినందుకు మండలంలోని ప్రజలందరూ అనంతుల అశ్విని ప్రశాంత్ కు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు.