calender_icon.png 20 August, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

20-08-2025 12:22:14 AM

యాదాద్రి భువనగిరి ఆగస్టు 19 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద సంఘటన లు జరిగాయి. భువనగిరి మండలం తాజ్ పూర్  చిన్నేటి వాగులో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరి వ్యక్తులు మృతి చెందారు. అదేవిధంగా వలిగొండ మండల్ వెలువర్తి గ్రామ చెరువు అలుగు వరదలు చేపల వేటకు వెళ్లిన యువకుడు చెందాడు.

వెంకటస్వామి మృతదేహం కోసం 15 గంటలు సెర్చ్ ఆపరేషన్ అనంతరం యువకుని శవం లభ్యమయింది. తాజ్పూర్ చిన్నేటి వాగులో చనిపోయిన యువకులు భువనగిరి పట్టణానికి చెందిన చేపల వెంకటేష్, రాజపూర్ గ్రామానికి చెందిన జహంగీర్ గా పోలీసులు గుర్తించారు. వీరి మృతితో వీరి మృతితో వెలువర్తి, తాజ్పూర్, భువనగిరి లలో విషాదఛాయలు అలుముకున్నాయి.  పోలీసులు మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.