ఈ నెల 31న జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ. సురేష్
పెద్దపల్లి, మార్చి- 26:(విజయక్రాంతి): తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ నెల 31వ తేదీన జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించ ను న్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ. సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండల స్థా యిలో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులకు జిల్లా స్థాయి పోటీలకు అర్హులని, మార్చి 31న మంగళవారం ఉదయం 10:00 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని, మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు నిర్ణీత సమయానికి మైదానానికి చేరుకోవాలని, ఎంపిక పోటీలకు వచ్చే క్రీడాకారులు, ఆధార్ కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుండి పొందిన బోనఫైడ్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, తాజా కుల ధృవీకరణ పత్రం, ఒక సెట్ ఒరిజినల్ , జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని, 4వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు 01.09.2017 నుండి 31.08.2018 మధ్య జన్మించి ఉండాలి, 31.08.2026 నాటికి వయస్సు పరిగణనలోకి తీసుకోబడుతుందని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




