ఆదివాసీ బిడ్డపై ఆరోపణలా?
బీఆర్‌ఎస్‌పై మండిపడ్డ మంత్రి సీతక్క
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): ఆదివాసీనైన తాను మంత్రి కా వడం బీఆర్‌ఎస్‌కు అస్సలు ఇష్టం లేద ని, అందుకే తనమీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరా జ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా గెలిచి, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని పనులు చేసి ఉంటే తాను మాట్లాడే అవసరం ఉండే ది కాదన్నారు.
గ్రామాల్లో రోడ్లు, వాటర్ ట్యాంక్, పారిశుద్ధ్యం, వీధీ దీపాలు వెలగడం లేదని ఇందుకు కారణం ఎమ్మెల్యే లు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలు కాదా? అని ప్రశ్నించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మ హిళా శిశు సంక్షేమ శాఖ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడు తూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఫైనాన్స్ నిధులు పెండింగ్ లో ఉండటం, ఆ నిధులు ల్యాప్స్ కాకుడదనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లు క్లియర్ కాకున్నా ఎన్నికలకు వెళ్లామని తెలిపారు. గ్రామాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే ఇన్ని రోజులు విద్యు త్ దీపాలు ఎలా పెట్టాం? పారిశుధ్యం లేకపోతే ఊర్లు ఉంటాయా? ప్రజలు విషజ్వరాల భారిన పడేవారు కాదా? అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్దిపై ప్రతి 15 రోజులకోసారి అధికారులతో రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ లేకుంటే గ్రామాల్లో నీళ్లే రావన్నట్లుగా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రూ. 57 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు -ఇచ్చామని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు బడ్జెట్ లో ప్రకటించి కేవలం రూ. 6 కోట్లు మంజూరు చేశారని ఆరోపించారు.




