20 May, 2026 | 12:33 PM

నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. సమ్మె ఉద్రిక్తతల మధ్య ఘటన

24-04-2026 01:02 AM

ఆత్మబలిదానాలు వద్దు..

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న శంకర్‌గౌడ్

నల్లగొండ బస్టాండ్‌లో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మాహుతియత్నం..

అప్రమత్తమై అడ్డుకున్న తోటి కార్మికులు

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

మహబూబాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో ఉద్రిక్తంగా మా రిం ది. అంతకుముందు డిపో గేటు ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్‌గౌడ్ తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోలు చల్లుకొని నిప్పంటించుకున్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం Vijayakranthi News వెబ్‌సైట్‌ను సందర్శించండి.

క్షణాల్లో శంకర్ గౌడ్ దేహానికి మంటలు అంటుకోవడంతో కార్మికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పీవేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ వైఖ రిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆత్మహత్యయత్నానికి పా ల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి తెలంగాణ తాజా వార్తల కోసం మా Telangana News విభాగాన్ని తప్పక చదవండి.

యాజమాన్యం మొండి వైఖరి వల్లే శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కార్మిక సంఘాల నాయకులు హెచ్చ రించారు. ౮౦శాతం కాలిన గాయలతో ఉన్న శంకర్‌గౌడ్‌ను వెంటనే వరంగల్ ఎంజీయం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆయనను కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పుత్రికి తరలించారు.  శంకర్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 

ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే కుటుంబ సభ్యులు లేదా సహాయం కోసం హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ ఘటన జరిగింది.

డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది?
తీవ్ర కాలిన గాయాలతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.