calender_icon.png 21 August, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీపీని పరామర్శించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు

21-08-2025 06:42:34 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలం నాగపెళ్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గురుసింగ బాపు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు పరామర్శించారు. రాజబాబు మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం కార్ యాక్సిడెంట్ లో కాలు విరగడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో వైద్య సహాయం తీసుకొని తన సొంత గ్రామమైన నాగపళ్లిలో ఉంటున్న మాజీ ఎంపీపీ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త గురుసింగ బాబును పరామర్శించి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  సహాయ సహకారాలతో అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ చైర్మన్ వామన్ రావు, తదితరులు పాల్గొన్నారు.