calender_icon.png 21 August, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ఆర్డీఓ పరిధిలో పలు భూ సమస్యలు పరిష్కారం

21-08-2025 06:40:30 PM

ప్రతి భూ సమస్యకు ఎవరు కలెక్టరేట్ కు రావాల్సిన అవసరం లేదు..

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): భూ భారతి పోర్టల్ లో కొన్ని మాడ్యూల్స్ లో భూ సమస్యలు ఆర్డీఓ పరిధిలో పరిష్కారం చేయడం జరుగుతుందని,   దరఖాస్తుదారులు అనవసరంగా కలెక్టరేట్ కు వచ్చి ఇబ్బంది పడవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ భారతి చట్టంలోని కొన్ని మాడ్యూల్స్ లో పరిష్కారం ఆర్.డి.ఓ స్థాయిలో లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. వాటిలో... 

1. మార్కెట్ విలువ 5 లక్షల కంటే తక్కువ ఉన్న మిస్సింగ్ సర్వే నెంబర్,

2. భూ విస్తీర్ణ సవరణ,

3. పట్టా పాస్ పుస్తకం డిజిటల్ సైన్, 

4. పట్టా పాస్ పుస్తకం లోని  పేరు సవరణ

5. పెండింగ్ మ్యూటేషన్,

6. పెండింగ్ సక్సేషన్,

7. నాలా,

8. కోర్ట్ కేసు పిపిబి  

9. నాల నుండి అగ్రికల్చర్ మార్చుకొనుట వంటి సమస్యలు ఆర్డిఓ కార్యాలయంలో పరిష్కారం అవుతాయని, వీటి కోసం అనవసరంగా కలెక్టరేట్ కు వచ్చి ప్రజలు ఇబ్బంది పడవద్దని కలెక్టర్ ఒక  ప్రకటనలో తెలిపారు.