03-12-2025 07:06:09 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాయిరి మహేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రవీణ్ రెడ్డికి శాలువాతో ఘనంగా సన్మానించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగోలం అబ్బయ్య గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉస్తేం గణేష్, జూపాక కుమార స్వామి, వల్స చందు పాల్గొన్నారు.