calender_icon.png 3 December, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల తల్లిదండ్రులు మనోధైర్యాన్ని కలిగి ఉండాలి

03-12-2025 07:11:33 PM

చొప్పదండి (విజయక్రాంతి): దివ్యాంగుల తల్లిదండ్రులు మనోధైర్యాన్ని కలిగి ఉండాలని మండల విద్యాధికారి పి మోహన్ మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు అన్నారు. ఈ మేరకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత కేంద్రంలో దివ్యాంగులకు క్రీడా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం చేపడుతున్న వసతులను వినియోగించుకోవాలని కోరారు. వారికి మేమున్నామని భరోసాను కల్పించాలని సూచించారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు కూడా సంపాదించే అవకాశం ఉందని తల్లిదండ్రులు వారిని చిన్నచూపు చూడవద్దని కోరారు. జిల్లా కలెక్టర్ వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.

పలువురు తల్లిదండ్రులు సదరం సర్టిఫికెట్ ఉన్న ఇప్పటివరకు వికలాంగులకు పింఛన్లు రావడంలేదని తెలపడంతో మండల విద్యాధికారి మున్సిపల్ కమిషనర్ స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా భవిత కేంద్రంలో ఉపాధ్యాయులుగా విద్యను అందిస్తున్న వారి సేవలను అధికారులు తల్లిదండ్రుల సంఘం ప్రశంసించారు. ఈ సందర్భంగా భవిత ఉపాధ్యాయులు పెద్ది శ్రీనివాస్ కట్టెకోల పద్మ సహాయకురాలు అనుమండ్ల లత లను స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ జలీల్ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు జలీల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి, రామస్వామి రుక్మాపూర్ పాఠశాల జూనియర్ సహాయకులు ఉదయ్ సిఆర్పిలు అశోక్ శ్రీనివాస్ ఎం ఐ సి దుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.