01-07-2025 12:00:00 AM
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, జూన్ 30 (విజయ క్రాంతి): ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పకుండ హాజరు కావాలని, వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులు అత్యంత ప్రాధాన్యతగా భావించి, ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరు కావాలని అన్నారు. ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిష్కరించాలని, జిల్లా అధికారులు తమ పరిధిలోనీ సమస్య పరిష్కారం వెంటనే చేయాలని, సమస్య పరిష్కరించలేని పక్షంలో సంబంధిత కారణాలు తెలుపుతూ, దరఖాస్తుదారునికి తెలపాలని సూచించారు.ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో మానవీయకోణంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలను అధికారులు పకడ్బందీగా పాటించాలని అన్నారు. ప్రతి వారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా అధికారులు వారి వారి శాఖ పరిధిలో సమీక్ష చేయాలని, పరిష్కారం నాణ్యతతో చేపట్టాలని, దరఖాస్తుల పరిష్కారం నాణ్యతపై, అదనపు కలెక్టర్ 5 శాతం ప్రజావాణి దరఖాస్తులను క్రాస్ చెక్ చేస్తారని అన్నారు.
ప్రతి జిల్లా అధికారి తన పరిధిలో జరిగే అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి వివరాలు సిద్దం చేయాలని అన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే సీఎస్ వీడియో సమావేశాలకు అవసరమైన నోట్స్ సిద్దం చేసి, ముందస్తుగా సమర్పించాలని అన్నారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, డిఆర్డీఓ ఎన్. సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.