01-07-2025 12:00:00 AM
భద్రాచలం, జూన్ 30 (విజయక్రాంతి); భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు డి సీతాలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు సమస్యలపై ఐద్వా బృందం సోమవారం సర్వే చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఇంకా 23 మంది వైద్యులు 40 మంది నర్సింగ్ స్టాఫ్ అవసరం ఉందని సర్వే బృందం దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
200 పడకల ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ కేవలం 40 మంది ఉన్నారని మరో 40 మంది అవసరం ఉందని తక్షణమే శానిటేషన్ వర్కర్స్ ని నియమించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. వైద్య సేవలో రోగులకు కావలసిన మెడిసిన్స్ అందుబాటులో లేవని ప్రధానంగా షుగర్ పేషెంట్స్ కు ఇన్సులిన్, థైరాయిడ్ పేషెంట్లకు మెడిసిన్స్ కొరత తీవ్రంగా ఉందని వెంటనే వాటిని తెప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
డెలివరీ వార్డులో ఆపరేషన్ చేసిన డెలివరీ పేషెంట్ వద్ద పిల్లలకు ప్రత్యేక ఊయల గాని బెడ్ గాని లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలో వచ్చిన సమస్యలపై సూపరిండెండెంట్ డాక్టర్ రామకృష్ణను వివరణ కోరగా వైద్యులు కొరత ఉందని పేర్కొన్నారని తెలిపారు.ఈ సర్వే కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాదెళ్ల లీలావతి ఐద్వార్ జిల్లా కమిటీ సభ్యులు జీవనజ్యోతి పట్టణ ఆఫీస్ బ్యారేర్స్ సు బ్బలక్ష్మి,సక్కుబాయి,నాగలక్ష్మి రాధా,తదితరులు పాల్గొన్నారు.