01-07-2025 12:00:00 AM
ఇల్లెందు టౌన్, జూన్ 30 (విజయక్రాంతి): ఇల్లందు ప్రాంత పర్యటనకు వచ్చిన కలెక్టర్ ను 21 అఖిలపక్ష నాయకులు సోమవారం కలిశారు. సింగరేణి జెకె 5 ఓసీ విస్తరణ అంశంలో నిర్వసితులకు, ఎఫెక్ట్ ఏరియా ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలనీ ఆ వినతిపత్రంలో వివ రించారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ జెకె 5 విస్తరణ పేరుతో మొదలుపెట్టుతున్న ఓసి లో తమ ప్రాంతం ఉందని 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి పుట్టిన ఇల్లందులో ఈ ప్రాంతం నుండే బొగ్గునిక్షేపాలను కనుగొన్నారని ఇప్పుడు జె కే 5 విస్తరణలో భాగంగా తమ ఇల్లులు, పొలాలను కోల్పోతూ నిర్వాసితులుగా మారుతున్నామని కలెక్టర్ కు తెలిపారు.
సర్వే చేసిన ఇళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని గతంలో జెకె 5 ఓసి నిర్వహణలో వారికి ఆర్ అండ్ ఆర్ వర్తింప చేశారని అదే విధంగా 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చారని, చెట్టు పుట్టకు కూడా ప్యాకేజీ ఇచ్చారని వారిలాగే ఈ ప్రాజెక్టు లో ఉన్న తమకు అందించాలని వారు కోరారు. అదేవిధంగా ఎఫెక్ట్ ఏరియాలో ఉన్న ప్రాంతాలను సింగరేణి దత్తత తీసుకోవాలని ముందుగా వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పి పట్టాలు ఇ ప్పించాలని అలాగే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు పిల్లలు ఉంటున్న క్వార్టర్స్ ను వారికి కేటాయించాలని కోరారు.
భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని అలాగే సిం గరేణి సంస్థ భవిష్యత్తులో జరగబోయే టెండర్లలో వారికి అవకాశం కల్పించాలని, ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎఫెక్ట్ ఏరియాలను మౌలిక సదు పాయాలు కల్పించాలని సింగరేణి సంస్థ కు దిశా నిర్దేశం చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడు తూ ఎన్ని ఇల్లులు పోతున్నాయని వ్యవసాయ భూమి ఎంత పోతుందని వారిని అడిగి తెలుసుకున్నారు.
250 పైగా ఇల్లు, వ్యవసాయ భూములు పోతున్నాయని, దాదాపు 1800 కు టుంబాలు ఎఫెక్ట్ ప్రాంతంలో కలిగి ఉన్నాయని కలెక్టర్ కి కమిటీ నాయకులు తెలిపారు. ఈ అం శాలను పరిశీలించి త్వరలో సింగరేణి అధికారులతో మాట్లాడతా అని కలెక్టర్ కమిటీ నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సురేందర్, మాజీ సర్పంచ్ ధనసరి స్రవంతి, వడ్ల శ్రీను, యెట్టి హరికృష్ణ, చాందావత్ రమేష్, బాబు, ధనసరి రాజు, భాస్కర్, మంచాల వెంకటేశ్వర్లు, క్లింట్ రొచ్, గుగులోత్ కృష్ణ, సుల్తానా, మొగిలి, లాలు, నాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.